ఆ వేడికి కరోనా పోతుందా..?

-

మార్కెట్ల నుంచి కూరగాయలు, షాపింగ్‌ మాళ్ల నుంచి బట్టలు తదితర సామాగ్రి తీసుకొస్తే వాటిని ఎండలో పెట్టడం, లేక వేడి నీళ్లలో కడగడం లేదంటే హెయిర్‌ డ్రయ్యర్‌తో వేడిగాలి తగిలిస్తే కరోనా పోతుందని çకొందరు అలా చేస్తుంటారు. సాధరణంగా పాజిటివ్‌ ఉన్న వ్యక్తులు తుమ్మినా, దగ్గినా , గట్టిగ మాట్లాడినప్పుడు∙వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తుల తుంపర్లు టేబుళ్లు స్టాండ్లు పలు వస్తువులపై పడినప్పుడు మనం తాకి అదే చేతులతో ముక్కు, నోటిని తుడుచుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తుంది. కూరగాయలు, పార్సిళ్ల విషయంలో సందేహాలు తలెత్తడానికి ఇదే కారణమంటున్నారు వైద్యులు.

జాగ్రత్తలు పాటించకనే..

పాజిటివ్‌ ఉన్న వారు సరైన జాగ్రత్తలు పాటించకుండ తుమ్మినా, తగ్గినా కూరగయల సంచులకు అంటుకునే ప్రమాదం ఉందనే అనుమానంతో కొందరు ఎండలో పెట్టడం, హెయిర్‌ డ్రయ్యర్‌తో గంటల పాటు వేడి గాలి తగిలించడం మరికొందరైతే న్యూస్‌పేపర్, పార్సిళ్లకు ఇస్త్రీ చేస్తుంటారు. వేడి వాతవరణంలోనూ వైరస్‌ బతికి ఉంటుందని కాబట్టి అలాంటి వాటితో ఎలాంటి లాభం లేదంటున్నారు వైద్యులు. పరిశుభ్రంగా ఉంటూ బయటి నుంచి తీసుకొచ్చిన కూరగాయలను శుభ్రంగా కడిగితేనే వైరస్‌ దరిచేరదు. కూరగాయలు కడిగే ముందు తర్వాత కూడా మన చేతులను సబ్బుతో కడుక్కొవాలి. అధిక ప్రెషర్‌ ఉండే నీటి కింద కూరగాయలను కడిగితే ఇంకా మంచిది. కూరగాయలను ఎక్కువసేపు ఉడికించి తినడంతో అ«ధిక వేడికి వైరస్, బ్యాక్టీరియా ఉంటే చనిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news