వీటిని మీ పిల్లలకి నేర్పండి.. అన్నిటిలో ముందే వుంటారు..!

-

పిల్లలు లైఫ్ లో మంచి పొజిషన్ లోకి రావాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని విషయాలని నేర్పిస్తూ ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో పిల్లలకి టీవీ ఫోన్ పెట్టేస్తున్నారు కానీ నిజానికి వాటికి దూరంగా పిల్లల్ని ఉంచకపోతే పిల్లలు ఏమి నేర్చుకోలేరు. పైగా వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. పిల్లల్ని ఈ విధంగా తల్లిదండ్రులు మారిస్తే ఖచ్చితంగా వాళ్ళ మెదడు పదునుగా మారుతుంది. పిల్లలతో రకరకాల ఆటల్ని ఆడించడం వలన వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

అలానే వాళ్ల చేత రకరకాల డ్రాయింగ్స్ గీయించడం లేదంటే చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలానే మెదడు పదునుగా మారుతుంది. ఏదైనా కథలని చెప్పండి. ఆ తర్వాత పిల్లలు ఆ కథలోని పాత్రలు తమను తాము చాలా సులభంగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. వారు ఏ పాత్రలో ఉన్నారో అలాంటి ఆటల కోసం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండండి. పిల్లలు చేత మెమరీ గేమ్స్ ని కూడా ఆడించండి పజిల్స్ వంటివి పూరించమనడం వంటివి చేస్తే పిల్లలు యొక్క మెదడు పని తీరు మెరుగు పడుతుంది.

సంగీతం పెయింటింగ్ లేదంటే కొత్త భాషను నేర్పడం ఇలా కళలని ప్రోత్సహిస్తూ ఉండండి మనం ఆలోచిస్తే చాలా కొత్త రకాల ఆటలను పిల్లలు చేత ఆడించడానికి అవుతుంది. ఇంటర్నెట్లో కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. పిల్లలని నెమ్మదిగా మళ్ళించండి. వాళ్లు దేనిలో యాక్టివ్ గా ఉన్నారో చూసి దాని వైపు ధ్యాస పెట్టేలా చేయండి అప్పుడు పిల్లలు యొక్క మెదడు పనితీరు బాగుంటుంది అన్నిట్లో కూడా వాళ్ళు ముందుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news