మరోసారి రైతులపై చంద్రబాబు రాజకీయం మొదలుపెట్టారు. చక్కగా సకాలంలో వర్షాలు పడి వ్యవసాయం బాగుందనుకునే సమయంలో బాబు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి..జగన్ పాలనలో రైతులు కన్నీరు పెట్టేస్తున్నారని బీద అరుపులు అరుస్తున్నారు. ఏపీలో గంజాయి పంట మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలో ఉన్నాయని మాట్లాడారు. ఏపీలో జగన్ ప్రభుత్వం సాగును .. దానితో పాటు రైతును చంపేశారని, తమ హయాంలో ఆక్వా, హర్టికల్చర్ రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.
నాలుగేళ్లల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ధాన్యం రైతుకి గిట్టుబాటు ధరలు లేవని, ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారని, కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదని, వరదల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. అయితే బాబు విమర్శలు బాగానే చేశారు గాని అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనేది మెయిన్. బాబు హయాం కంటే జగన్ హయాంలో వర్షాలు సకాలంలో సమృద్ధిగా పడుతున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి.
రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 ఇస్తున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, తక్కువ వడ్డీకి రుణాలు, క్రాప్ లోన్‌లు.ఇలా అన్నీ రకాలుగా రైతులుగా అండగా నిలబడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం, తడిచిన వడ్లని కూడా కొన్నారు. రైతులకు సకాలంలో పంట డబ్బులు అందించారు. అటు ఆక్వా, హార్టికల్చర్ పంటలకు ఊతమిచ్చేలా జగన్ ప్రభుత్వం పనిచేస్తుంది.
వ్యవసాయం దండగ అని చెప్పిన బాబుకు ధీటూగా జగన్ వ్యవసాయం పండుగ చేశారు. రైతులకు అండగా నిలబడుతున్నారు. ఇక రైతు రుణమాఫీ అని చెప్పి సగంలోనే రైతులకు ఎగనామం పెట్టిన బాబుని ఆ రైతులే నమ్మే పరిస్తితి కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు ఇలా రైతుల పై రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.