వామ్మె.. బుడతలోనూ అధిక రక్తపోటు!

-

‘మా నాన్నకు అధికరక్తపోటు(హైబీపీ), మా బామ్మకు హైబీపీతో అనారోగ్యానికి గురైంది’ అనే మాటలు వింటుంటాం. కానీ.. ప్రస్తుతం చింటూ, పక్కింటి చిన్నారికి హైబీపీ ఉందనే మాటలు వినాల్సి వస్తోంది. పలువురికి ఇతరాత్ర జబ్బులతో వస్తే మరికొందరికి వంశపారం పర్యంగా వస్తుంది. దీన్ని తొందరలోనే గుర్తించి చికిత్స అందించాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వైద్యులు సూచిస్తున్నారు.

బీపీని ఓ కచ్చితమై సంఖ్యతో సూచించి 120,80 ఉంటే సాధారణంగా ఉందని గుర్తిస్తాం. 129,80 ఉంటే ప్రారంభ దశ, 139,80 ఉంటే మొదటి దశ, 140,90 గనుక దాటితే హైబీపీగా నిర్ధారిస్తారు. కానీ.. ఇది పిల్లలో సాధ్యమవ్వదు. నవజాతశిశువు నుంచి పదమూడేళ్ల వరకు ఒకలాగా, 13 నుంచి 18 ఏళ్లవారిని విభాజించి పరీక్షించాల్సి వస్తోంది. 13 ఏళ్లు దాటితే పెద్దవారితో సమానంగా ఫలితాలు వస్తాయి. పర్సంటైల్‌ 90 కన్న తక్కువ ఉంటే సాధారణంగా, అంతకు మించితే రక్తపోటు దశ ప్రారంభమైందనే చెప్పవచ్చు. కానీ..99 మించితే ప్రమాదకర దశేమరి.

రెండు రకాలుగా చెప్పవచ్చు..

1. జలుబుతో సంబంధం ఉండేది: ఇది దాదాపుగా ఆరేళ్లలోపు వారిలోనే ఎక్కువగా కన్పిస్తోంది. దాదాపుగా కిడ్నీ, రక్తనాళా జలుబే ప్రదాన కారణంగా చెప్పవచ్చు. రక్తనాళాల గోడలు గట్టిగా అవ్వడం, గుండె నుంచి రక్తన్ని తీసుకెళ్లే బృహద్ధమని శాఖలో వాపు రావడం, మూత్ర పిండాల్లో తిత్తులు వడపోత ప్రక్రియకు అవసరమయ్యే భాగాలు దెబ్బతినడం, కిడ్నీలకు రక్త సరఫరా చేసే నాళాలు గట్టిపడటం,(రీనల్‌ అర్టరీ స్టెనోసిస్‌) వంటివి అధిక రక్తపోటు దారి తీస్తాయి.

2. జలుబుతో సంబంధం లేనిది: ఇది దాదాపుగా పెద్ద పిల్లలోనే కన్పిస్తోంది. దీనికి ప్రత్యేకమైన కారణలంటూ ఏమీ ఉండవు. ఉప్పు ఎక్కువగా తినడం, ఎక్కువసేపు ఓకే చోట కూర్చోవడం, కుటుంబంలో ఒకరిద్దరికి రక్తపోటు, తదితర కారణాలు కావొచ్చు.

జాగ్రత్తలు ఇవి..

తిరుతిళ్లు మానేసి పౌష్టికాహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేస్తే దాదాపుగా రక్తపోటును నివారించవచ్చు. ఆహార, వ్యాయామ నియమాలు పాటించినా రక్తపోటు ఎక్కువగా ఉంటే ఏసీఈ ఇన్‌హిబాటర్స్, బీటా బ్లాకర్లు, వంటి మందులను వైద్యులు సూచిస్తారు. ఇలా.. నెల పరిశీలించి రక్తపోటును బట్టి మందులను తగ్గిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news