తల్లిపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయడానికి.. 130 కి.మీ సైకిల్‌ తొక్కిన బాలుడు.. చివరలో ట్విస్ట్ అదుర్స్

-

సాధారణంగా పిల్లలను మందలిస్తే వారు నాన్నకి చెబుతాననో.. లేదా అమ్మమ్మకు చెబుతాననో తల్లిని బెదిరిస్తూ ఉంటారు. అలా ఓ బుడ్డోడు తన తల్లితో గొడవపడి ఆమెపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయడానికి ఇంటి నుంచి బయల్దేరాడు. ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లాడు. కానీ అమ్మమ్మ ఇంటికి చేరుకోలేకపోయాడు. ఇంతకీ ఏమైందంటే..?

చైనాకు చెందిన ఓ బాలుడు తన తల్లితో గొడవపడ్డాడు. తన తల్లిపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకుని మిజియాంగ్‌లో ఉన్న అమ్మమ్మ ఇంటికి సైకిల్‌పై బయలుదేరాడు. రహదారిపై ఉన్న గుర్తుల సాయంతో పయనించసాగాడు. ఇంటి నుంచి వెంట తెచ్చుకున్న బ్రెడ్‌, మంచినీళ్లతో కడుపు నింపుకున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. గంటలో చేరుకోవాల్సిన తన అమ్మమ్మ ఇల్లును.. దారి తప్పడం వల్ల చేరుకోలేకపోయాడు.

చివరకు అలసిపోయి ఓ చోట పడిపోయాడు. గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు పోలీస్ స్టేషన్​కు తరలించి బాలుడి తల్లి, అమ్మమ్మకు అప్పజెప్పారు. కోపంలో అతడిని అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని బెదిరించినట్లు బాలుడి తల్లి తెలిపింది. అయితే అతడు నిజంగా అలా చేస్తాడని భావించలేదని పేర్కొంది. బాలుడి కథ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news