చైనా కరోనా వ్యాక్సిన్ రెడీ…?

-

చైనా వ్యాక్సిన్ పై ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. చైనా వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశకు చేరుకుందని పేర్కొంది. వచ్చే ఏడాది దీనిని తయారు చేయాలని భావిస్తున్నట్లు ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. జూలై మధ్యలో ప్రారంభమయ్యాయి ఈ ట్రయల్స్ అని పేర్కొన్నారు. సినోఫార్మ్ యొక్క చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సిఎన్‌బిజి) మరియు అబుదాబికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ గ్రూప్ 42 (జి 42) ల మధ్య భాగస్వామ్యంలో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.

యుఎఈ, ఈజిప్ట్, బహ్రెయిన్ మరియు జోర్డాన్లలో 31,000 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొంది. సినోఫార్మ్‌తో పంపిణీ, తయారీ ఒప్పందాలు ఉన్నాయని 42 హెల్త్ కేర్ సీఈఓ ప్రకటన చేసారు. వచ్చే ఏడాది యుఎఇలో 75 నుంచి 100 మిలియన్ల మోతాదుల ఉత్పత్తి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version