బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలను ఖండించిన చైనా

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో పలు దేశాలు చైనాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా వైరస్‌కు సంబంధించి చైనాపై గుర్రుగా ఉంది. భారత్‌ విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున ఎవరు కూడా చైనాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాత్రం కరోనా వ్యాప్తికి చైనానే కారణమనే తీరుగా నినాదాల చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్‌లోని చైనా ఎంబసీ ఖండించింది. ఈ మేరకు ఎంబసీ కౌల్సిలర్‌ లియూ బింగ్‌ రాజాసింగ్‌కు ఓ లేఖను మెయిల్‌ చేశారు.

కరోనా వైరస్ తొలి కేసు చైనాలోనే నమోదైందని బింగ్‌ అంగీకరించారు. ప్రపంచానికి ఈ వైరస్‌ గురించి తెలియజేసింది చైనానే అని బింగ్‌ అన్నారు. అంతా మాత్రాన కరోనా చైనాలో పుట్టిందనడం సరైదని కాదని చెప్పారు. చైనాలో కాకపోతే ఇది మరెక్కడైనా బయటపడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, ప్రధాని పిలుపు మేరకు ఏప్రిల్‌ 5న ధూల్‌పేటలో దీపం వెలిగించిన రాజాసింగ్‌.. ‘గో బ్యాక్‌, గో బ్యాక్‌..  చైనీస్‌ వైరస్‌ గో బ్యాక్‌’ అని నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 7,447 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 239 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news