4 వేల వెబ్ సైట్లను మూసేసిన చైనా..!

-

కొన్నేళ్ల కింద ఇండియా కూడా కొన్ని వేల పోర్న్ వెబ్ సైట్లను మూసేసింది. ఇదే తరహాలో ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా తమ దేశానికి హానికరమైన వెబ్ సైట్లను నిషేధిస్తూ వస్తున్నాయి. తాజాగా చైనా దాదాపు 4 వేల వెబ్ సైట్లను బ్లాక్ చేసేసింది. ఇటీవలే నేపాల్, కంబోడియా దేశాలు తమ దేశానికి అవసరం లేని కొన్ని వెబ్ సైట్లను బ్లాక్ చేశాయి. దాదాపు మూడు నెలల నుంచి కొన్ని రకాల వెబ్ సైట్లపై నిఘా పెట్టి చైనా ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియాకు సంబంధించిన వెబ్ సైట్లతో పాటు అశ్లీల వెబ్ సైట్లు, మతాలను రెచ్చగొట్టే వెబ్ సైట్లు, రూమర్స్ వెబ్ సైట్లు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వెబ్ సైట్లను చైనా ప్రభుత్వం బ్లాక్ చేసేసింది. సైట్లలో ఉన్న కంటెంట్ మార్చుకోవాలంటూ దాదాపు 230 సంస్థలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సైట్లలోని కంటెంట్ లో ఉండే కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడిన సమాచారం, విలువలను దిగజార్చే విధంగా ఉండే సమాచారం, రెచ్చ గొట్టే సమాచారం లాంటి వాటిని ప్రభుత్వం ఆయా వెబ్ సైట్ల నుంచి ప్రభుత్వం తొలగించింది.

Read more RELATED
Recommended to you

Latest news