సినీ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం (94) ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు చేరుకొని ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు సినీ నటీమణులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. అనంతరం కనకరత్నం అంత్యక్రియలలో సినీ నటీమణులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అందులో భాగంగా చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అయాన్ కలిసి అంత్యక్రియలలో పాల్గొని కనక రత్నం పాడెను మోసారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా గత కొద్ది రోజుల నుంచి అల్లు vs మెగా కుటుంబాల మధ్య ఏవో గొడవలు ఉన్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గొడవల వల్ల రెండు కుటుంబాలు దూరంగా ఉన్నాయని జోరుగా ప్రచారాలు సాగాయి. చాలా సందర్భాలలో అల్లు అర్జున్, చిరంజీవి మా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పినప్పటికీ ఈ వార్తలకు ముగింపు లేకుండా పోయింది. కాగా, ఈ రోజు కనక రత్నం అంత్యక్రియలలో చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి పాల్గొనడంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ వచ్చింది.
Om Shanti Allu Kanakaratnam garu 🙏 pic.twitter.com/OzHwSOgdvA
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) August 30, 2025