కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అంటూ మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసారు. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చలు జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్ లో మాట్లాడారు. కాళేశ్వరం గురించి ఎంతో గొప్పలు చెప్పిన కేసీఆర్ అసెంబ్లీలో క్లారిటీ ఇవ్వాలని అన్నారు.

ఒకవేళ ఆయన అసెంబ్లీకి రాకపోయినట్లయితే తప్పు ఒప్పుకున్నట్లేనని మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కమిషన్ నివేదికకు భయపడి కేసీఆర్ మళ్ళీ కోర్టుకు వెళ్లారని తెలిపారు. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండడానికి యూరియా పేరుతో బిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. ఈ విషయపైన స్పందించి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా లేదా చూడాలి. అసెంబ్లీకి కేసీఆర్ రావాలని, మాట్లాడాలని చాలామంది ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.