అనసూయను చూస్తే.. చిరుకు సైతం హార్ట్ ఎటాక్!!

-

అనసూయ అందాలు వర్ణించడం అంటే మామూలు విషయం కాదు. బుల్లితెరను, వెండితెరను తన అందాలతో కట్టిపడేసిన అనసూయ.. అశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. జబర్దస్త్ షోతో మొదలైన తన ప్రస్థానం.. వెండితెరపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేస్థాయికి ఎదిగింది. ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.

ఎప్పుడైతే క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో అనసూయ తన ప్రతిభను నిరూపించుకుందో.. అప్పటి నుంచి అనసూయ రేంజ్ మారిపోయింది. అనసూయను ఇప్పటికీ రంగమ్మత్తగా గుర్తిస్తూనే ఉంటారంటే.. ఆ పాత్రలో ఆమె ఎంతగా జీవించిందో అర్థమవుతుంది. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా వస్తోన్న ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనసూయపై చిరు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు తన ప్రసంగం చివర్లో అనసూయపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘అనసూయ నువ్వేంటి ఇక్కడ. నువ్వూ ఈ సినిమాలో యాక్ట్ చేసావా? లేక గెస్ట్‌గా వచ్చావా’ అని చిరు అడిగితే.. ‘గెస్ట్ గానే వచ్చాను సర్’ అని చెప్పింది. ఆ తర్వాత ఉన్నట్టుండి చిరు గుండెను పట్టుకుని ‘పట్టేసింది. ఇంతకుముందు కూడా ఛాతి నొప్పి వస్తే డాక్టర్లకు చూపించుకున్నాను. గట్టి గుండె అని చెప్పార’ని అనసూయ వైపు చూస్తూ అనడం అక్కడివారంతా పగలబడి నవ్వారు. అనసూయ.. ‘ఈ విషయం రామ్ చరణ్‌కి చెప్పకు’ అని కొంటెగా అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news