సాయం కోసం నాఇంటికి వచ్చి నా పై ఆరోపణలా! రోజా పై చిరు ఫైర్.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు..సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ కు రెడీ గా ఉంది .విశాఖ పట్టణంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.

ఈప్రమోషన్స్ కూడా సూపర్ ల్లెవెల్లో చేస్తూ అదరగొడుతున్నారు.. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్ గా వీరయ్య టైటిల్ సాంగ్ కూడా వ్యూస్ కొల్లగొడుతోంది.అయితే తాజాగా వాల్తేరు వీరయ్య టీం కున్యూ ఇయర్ సందర్భంగా  చిరంజీవి మంచి పార్టీ కూడా ఇచ్చారు.ఇక వీరయ్య ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అనేక మీడియా సంస్థ లకు  మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తనపై గతంలో విమర్శలు చేసిన రోజా కు ఘాటుగా రిప్లై ఇచ్చారు.తాజాగా చిరంజీవి కౌంటర్ ఇస్తూ నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. అడ్డా దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు.ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. నేను ఎవ్వరికి సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి అందరికీ తెలుసు, అది వారికి కూడా తెలుసు అంటూ చురకలు అంటించారు చిరు.

 

Read more RELATED
Recommended to you

Latest news