రాజ‌కీయాల్లోకి చిరంజీవి.. ఆ పార్టీకి గాడ్ ఫాద‌ర్ సపోర్ట్!

-

గ‌త కొద్ది రోజుల నుంచి మెగా స్టార్ చిరంజీవి రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతున్నార‌నే వార్తలు సోషల్ మీడియాలో, ఫిల్మ్ న‌గ‌ర్ లో తెగ చక్క‌ర్లు కొడుతుంది. అంతే కాకుండా మెగా స్టార్ చిరంజీవి ఒక పార్టీకి కూడా స‌పోర్ట్ చేస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిలో నిజం ఎంతా.. అని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ వార్త నిజ‌మే అని తెలుస్తుంది. అయితే నిజ జీవితంలో కాదు.. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమాలో నిజం. మ‌ల‌యాళ లూసిఫ‌ర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాద‌ర్ గా ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో మోహ‌న్ లాల్ పాత్ర‌ను చిరంజీవి చేస్తున్నారు. కాగ ఈ సినిమా క‌థాంశం ప్ర‌కారం హీరో రాజ‌కీయాల్లో ప‌లుకు ప‌డి ఉంటుంద‌ట‌. అంతే కాకుండా జ‌న జాగృతి అనే పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇస్తాడ‌ట‌. ఇదే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. అంతే కాకుండా చిరంజీవి ఆ జ‌న జాగృతి పార్టీలో చేరుతున్న‌ట్టు కూడా వార్తలు వ‌చ్చాయి. కాగ ఈ వార్త‌లు నిజ‌మే కానీ.. నిజ జీవితంలో కాద‌ని ప్ర‌స్తుతానికి ఒక క్లారిటీ వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version