Chiranjeevi: ‘బలగం’ మూవీ డైరెక్టర్ వేణుకు మెగాస్టార్ ప్రశంసలు

-

కమెడియన్ వేణు డైరెక్షన్‌లో తెరకెక్కిన బలగం సినిమాకు ఊహించని విధంగా స్పందన లభిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ఇవాళ ఉదయం ‘బలగం’ టీమ్‌ను ప్రశంసించారు. తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్‌’ సెట్‌లో ‘బలగం’ టీమ్‌ను కలిసిన ఆయన చిత్రబృందాన్ని సన్మానించారు.

‘‘’కంగ్రాట్స్‌ వేణు. చిత్రాన్ని చక్కగా రూపొందించావు. ఇంత బాగా సినిమా చేసి మాకు షాకులు ఇస్తే ఎలా? నిజాయతీ ఉన్న సినిమా ఇది. కమర్షియల్‌ ప్రొడ్యూసర్‌ ఉన్నా నువ్వే దీనికి పూర్తి న్యాయం చేశావు. తెలంగాణ సంస్కృతిని 100 శాతం చూపించావు.’ అని ఆయన అన్నారు.

దీనికి సంబంధించిన వీడియోను ‘బలగం’ హీరో ప్రియదర్శి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశాడు. ‘’‘చిరు అన్నయ్యా.. మీ సినిమాలు చూసి ఎన్నో సందర్భాల్లో నేను స్ఫూర్తి పొందాను. అలాంటి నేను ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమాభిమానాన్ని పొందడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ‘బలగం’ కోసం మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఏదో ఒకరోజు మీతో కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నాను’’’ అని పేర్కొన్నాడు.

https://mobile.twitter.com/OfflVenu/status/1634456173674917898?cxt=HHwWlMCzjd7O4K4tAAAA

Read more RELATED
Recommended to you

Exit mobile version