టాలీవుడ్ లో ఇప్పుడు బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ కొనసాగుతుంది. సోషల్ మీడియా టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించి తమ ఇంట్లో చేస్తున్న పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తర్వాత… రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, శర్వానంద్, కొరటాల శివ ఇప్పుడు చిరంజీవి దీనిని స్వాగతించి సోషల్ మీడియాలో తమ వీడియో లను పోస్ట్ చేసారు.
ఇటీవల రాజమౌళి ఛాలెంజ్ ని స్వీకరించిన జూనియర్ ఎన్టీఆర్… చిరంజీవిని నామినేట్ చేసారు. దీనికి చిరంజీవి స్పందించారు. తాజాగా ఆయన ఇంట్లో దోశలు వేస్తున్న వీడియో ని పోస్ట్ చేసారు. భీమ్ అని సంబోధిస్తూ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసారు. నేను రోజు చేసే పనులే ఇవ్వాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం అని ఆయన తన వీడియో ని పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లు శుభ్రం చేస్తున్న వీడియో తో పాటుగా,
కిచెన్ లో దోశలు వేస్తున్న వీడియో ని షేర్ చేసారు. ఈ వీడియోలో చిరంజీవి పెనం మీద ఉన్న దోస ను ఎగురవేస్తూ ఉంటారు. ఇక తన తర్వాత మంత్రి కేటిఆర్ ని అలాగే సూపర్ స్టార్ రజని కాంత్ ని ఈ ఛాలెంజ్ కి ఆహ్వానించారు. ఈ మధ్య కాలంలో ఇది బాగా పాపులర్ అయిన ఛాలెంజ్. అటు వారి అభిమానులు కూడా ఈ ఛాలెంజ్ ని స్వీకరించడం గమనార్హం.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020