మన ‘ లోకం ‘ OBSERVATION : కే‌సి‌ఆర్ మాట జవదాటని చిరంజీవి .. !!

-

కరోనా వైరస్ ఎఫెక్ట్ చాలా దేశాల్లో ఉంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ఇటలీలో పడగ విప్పిన తాచుపాము లా మనుషుల ప్రాణాలను బలిగొంటోంది. ఈ వైరస్ వల్ల చాలామంది ఇప్పటికే దాదాపు కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అయితే యూరప్ దేశాల నుండి మరియు ఇతర దేశాల నుండి తమ దేశానికి ఎవరు రావద్దని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ వ్యాధి ఎక్కువగా ప్రజలు గుమిగూడి ఉండే ప్రాంతాలలో ఒకరి నుండి ఒకరికి వ్యాపించే వైరస్ కావటంతో చాలా వరకు ప్రభుత్వాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు ఉండకూడదని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగానికి కరోనా వైరస్ వల్ల బాగా దెబ్బ పడింది. హాలీవుడ్ సినిమాలు ఏవి కూడా ఇప్పుడప్పుడే రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయిపోయాయి. ఇదే తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా 500 కోట్లు కేటాయిస్తూ, ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలు మూసివేయాలని, మరియు అదేవిధంగా ఒకవేళ ఫంక్షన్ జరిగితే 200కు మించి అతిథులు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.

 

అంతేకాకుండా సినిమా హాల్స్, పబ్స్, క్లబ్స్ బంద్ లో ఉండాలని కేసీఆర్ సూచించారు. ఇటువంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా ప్రజల ఆరోగ్యం కోసం కెసిఆర్ మాట జవదాట కుండా ఆచార్య సినిమా షూటింగ్ ఆపేశారు అట. షూటింగ్లో భాగంగా ఎక్కువగా ప్రజలు గుమిగూడే సన్నివేశాలు ఉండటంతో చిరంజీవి నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version