మెగాస్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఆచార్య నుంచి అదిరిపోయే అప్డేట్

మెగా స్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న “ఆచార్య‌” సినిమా పై మెగా ఫాన్స్ కు ఓ రేంజ్‌లో అంచ‌నాలున్నాయి. ఇందుకు కొర‌టాల చేసిన ప్ర‌తి సినిమా బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. పైగా ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టికే చాలాసార్లు వాయిదా ప‌డింది. అయితే వాస్తవానికి ఆచార్య సినిమా మే 13న రిలీజ్ కావాల్సి ఉండగా… కరోనా సెకండ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయి ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

మరో 10 నుంచి 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి మరియు రాంచరణ్ మధ్య కీలక సన్నివేశం పూర్తయితే ఈ మూవీ కంప్లీట్ అయినట్టే. వచ్చే నెల రెండో వారంలో ఈ చివరి భాగం షూటింగ్ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. అలాగే కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతుండటంతో టాలీవుడ్ పరిశ్రమ షూటింగ్స్ కు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆచార్య మూవీ షూటింగ్ కూడా పూర్తి చేయడానికి చిత్ర బృందం సిద్ధం అవుతోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా.. పూజా హెగ్డే, చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.