చిరంజీవి సినిమా అంటే యుద్ధమే.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

-

రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. 80 దశాబ్ద కాలం నుంచి నేటి వరకు అదే ఫాలోయింగ్ కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడం జరిగింది. సినిమాలలో మంచి ఊపు మీద ఉన్నప్పుడే రాజకీయాలలోకి వెళ్లి మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి అంతే వేగంతో సినిమాలలో నటిస్తున్న చిరంజీవిని చూసి ప్రేక్షకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తన కొడుకు రాంచరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నప్పటికీ ఈయన నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాపై ఏమాత్రం ఆ ప్రభావం పడలేదని చెప్పవచ్చు.

ఇటీవల రంగ రంగ వైభవంగా సినిమాకు దర్శకత్వం వహించిన గిరీషయ్యా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తనది పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామం అని.. అప్పట్లో వీధి సినిమాలు వేస్తూ ఉండేవారని.. అలా చిరంజీవి నటించిన దొంగ మొగుడు సినిమా కూడా వీధి సినిమాగా ప్రదర్శితం అయింది అని ఆయన చెప్పుకొచ్చారు..ఇక అంతే కాదు ఆయన మాట్లాడుతూ మా పిల్లల బ్యాచ్ అందరికి ఒక కాన్సెప్ట్ ఉండేది.. చిరంజీవి గారి సినిమా ఏదైనా సరే ఊర్లో పడితే ఊర్లో ఉండే ఏ చెట్టుకు కూడా పూలు ఉండకూడదు అని, ఆ పూలు అన్నీ కోసుకొచ్చి మూటలో పెట్టేసే వాళ్ళమని ఆయన వెల్లడించారు.

ఇక దొంగ మొగుడు సినిమాలో డ్యూయల్ రోల్లో చిరంజీవి నటించగా.. సినిమా అంతా అయిపోయిన తర్వాత చివర్లో మరో చిరంజీవి భానుప్రియ కు పెయిర్ గా వస్తారని ఆ సమయంలో ప్రొజెక్షన్ ఆపేయడంతో మాకు ఇబ్బంది కలిగింది.. మళ్లీ ఒక యుద్ధం చేసి వారితో ప్రొజెక్షన్ వేయించి పూలు వేసామని గిరీషయ్యా వెల్లడించారు. చిరంజీవి సినిమా విషయంలో ఏదైనా తక్కువ జరిగితే గొడవలు అయిపోయేవి అంటూ ఆయన పరోక్షంగా కామెంట్లు చేయడం గమనార్హం. ఇక వైష్ణవ తేజ్ నటిస్తున్న రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ రెండో తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version