Asia Cup 2022: తొలి మ్యాచ్‌లో శ్రీలంక చిత్తు.. ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం

-

ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో శ్రీలంక పై 8 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్తాన్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ కు ఓపెనర్లు హజ్రతుల్లా జాజాయ్ మరియు రెహమానుల్లా 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్ కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.

తద్వారా ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే చేధిoచింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో హజ్రతుల్లా 37 పరుగులు గురుబాజ్ 40 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో హసరంగా ఒక్కటే ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక… ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల దాటికీ 115 పరుగులకే కుప్ప కూలింది.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో పజాల్క్ మూడు కీలక వికెట్లు పడగొట్టగా… నబి మరియు ముజీబ్ తలో రెండు వికెట్ సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్ష 38 పరుగులతో టాప్ స్కోరరుగా నిలిచాడు. అయితే లక్ష్యం చిన్నది కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version