మంచిగున్నవ్..నాకు నచ్చినవ్.. మహిళతో సీఐ.. !

-

భూమి తగాదా విషయమై పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మహిళతో సిఐ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మ‌హిళ‌ తమ భూమిలోకి వచ్చి తన బాబాయ్ అక్రమంగా దున్నుతున్నాడని అడిగితే దాడులు చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాత్రి 7గంటలకు వెళ్ళింది. అయితే ఆ సమయంలో సీఐ తనతో అనుచితంగా మాట్లాడారని సోమవారం విలేకరులకు ఫోన్ చేసి చెప్పింది.

typical Indian police inspector By – Pravin Katepallewar

సీఐ రాత్రి 11 గంటల వరకు ఒక్క దాన్నే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని … నువ్వు మంచిగా ఉన్నావ్ కదా నువ్వు నాకు నచ్చావ్.. అంటూ మాట్లాడారని చెప్పింది. అంతేకాకుండా పెద్ద వాళ్లతో గొడవలు ఎందుకు అని సీఐ చెప్పినట్టు ఆరోపించింది. అయితే కొన్ని గంటల్లోనే మళ్లీ విలేఖర్లకు విలేకర్లకు ఫోన్ చేసి.. నేను చెప్పినవి పేపర్ లో రాయవద్దు.. అధికారులు సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనుకోకుండా జరిగింది అని తెలిపింది. ఈ విషయంపై విలేకర్లు సీఐ ని ప్రశ్నించగా మ‌హిళ  ఫిర్యాదు పత్రం ఇష్టం వచ్చినట్లు రాసిందని మార్చి రాయమని దాబాయించామని అంతేగాని వ్యాఖ్యలు చేయలేదని అని సమాధానమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version