కారులో మరో మహిళతో సీఐ రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

-

అక్రమం సంబంధాలు ఎన్నో సమస్యలకు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి. అయితే.. ఉన్నత స్థానంలో ఉన్నా కూడా వివాహేతర సంబంధాలతో చట్టంముందు దోషులుగా నిలబడుతున్నారు. అయితే.. వనస్థలిపురం శివారులో ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మరో మహిళతో ఉండగా, అతడి భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ క్రమంలో గొడవ జరుగుతుండడంతో అటువైపు వెళ్లిన పెట్రోలింగ్‌ పోలీసులపై మద్యం మత్తులో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ దాడికి పాల్పడ్డాడు. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. 2002 బ్యాచ్‌కు చెందిన రాజు ప్రస్తుతం సిటీ సౌత్‌జోన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వనస్థలిపురం కప్పల చెరువు ప్రాంతంలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. నాలుగు రోజుల క్రితం అతడిని సీపీ సీవీ ఆనంద్‌ సీసీఎ్‌సకు బదిలీ చేశారు. కానీ, ఇంకా రిపోర్టు చేయలేదు. ఆరు నెలలుగా భర్త ప్రవర్తనపై అనుమానం కలిగిన భార్య అతడిపై ఓ కన్నేసి ఉంచింది. గురువారం రాత్రి మునుగోడు ఎలక్షన్‌ డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన ఇన్‌స్పెక్టర్‌ రాజు.. పని ఉందని అర్ధరాత్రి బయటకు వెళ్లాడు. భర్త తీరుపై అనుమానంతో ఉన్న ఆమె ఇద్దరు పిల్లలను తీసుకొని ఆయన వాహనాన్ని ఫాలో చేసింది.

 

సాగర్‌ కాంప్లెక్స్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ పక్కన నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళతో కారులో ఉండడాన్ని గుర్తించింది. భర్తను, ఆ మహిళను నిలదీసింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండడంతో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తోన్న కానిస్టేబుల్‌ రామకృష్ణ, హోంగార్డు నాగార్జున పిల్లల అరుపులు, గొడవ విని అటువైపు వెళ్లారు. వివరాలు తెలుసుకుంటుండగా రాజు ఇన్‌స్పెక్టర్‌నే ప్రశ్నిస్తారా.. అంటూ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. కోపంతో ఊగిపోతూ వారిపై దాడి చేశాడు. దీంతో రామకృష్ణ ముఖంపై గాయాలయ్యాయి. హోంగార్డు నాగార్జున హెడ్‌ కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌కు సమాచారమందించారు. ఇతర సిబ్బందితోపాటు అక్కడికి చేరుకున్న ఆయన ఇన్‌స్పెక్టర్‌ రాజును వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షకు సహకరించకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం పరీక్షలు చేయడానికి ఉస్మానియాకు తరలించి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version