లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ ని చూస్తారు.హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఇలా ఏది తీసుకోవాలన్న సరే క్రెడిట్ కార్డు తాలూకా స్కోర్ ని చూస్తారు. అయితే దేనికైనా సరే క్రెడిట్ కార్డు చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్‌ను చెక్ చూస్తాయి బ్యాంకులు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే తాజాగా ఎక్స్‌పీరియన్ ఇండియా సేవను ఇస్తోంది.
చాలా మంది క్రెడిట్ స్కోర్ ని చూడకుండా లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఇలా ఈజీగా స్కోర్ ని ఎలా చెక్ చేసుకోవాలో వారికి తెలియదు. క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకోవడం వాట్సాప్ తో ఈజీ. దీనితో మీకు సిబిల్ స్కోర్ చూడడం సులభం.
దీని కోసం ముందుగా మీరు ఎక్స్‌పీరియన్ ఇండియాకు చెందిన +91-9920035444 వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
ఆ తరవాత మీరు ఫోన్ నుండి హాయ్ అని పంపాలి.
నెక్స్ట్ మీరు మీ పేరు, ఇ-మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్ ని ఇవ్వండి.
దీని తర్వాత మీరు వాట్సప్ ద్వారా మీ ఎక్స్‌పీరియన్ క్రెడిట్ స్కోర్‌ను పొందుతారు.
ఎక్స్‌పీరియన్ క్రెడిట్ రిపోర్ట్ పాస్‌వర్డ్ రక్షిత కాపీని అభ్యర్థించవచ్చు. అది ఈమెయిల్ కి వస్తుంది. ఇలా సులభంగా మీరు స్కోర్ ని పొందొచ్చు.