ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఐఆర్ఆర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) స్కామ్ కేసులో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీమంత్రి నారాయణను చేర్చుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించింది. లోకేశ్, లింగమనేని రాజశేఖర్, రమేశాను ముద్దాయిలుగా చేర్చింది. సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందమే జరగలేదని సీఐడీ పేర్కొంది.
కాగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న హయాంలో ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఐఆర్ఆర్ అలైన్ మెంట్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీఐడీ ఈ కేసులో నిందితుడిగా చేర్చింది. ఐఆర్ఆర్ అలైన్ మెంట్ ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ ,మాజీ మంత్రి నారాయణ ఫ్యామిలీ లబ్ది పొందారని సీఐడీ ఆరోపించింది.