రోహిత్, హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకున్నారా ?

-

ఇటీవలే ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు ఫ్రాంచైజీ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే.ముంబై యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతనిని కెప్టెన్సీగా ఎంచుకున్నట్టు ఆ జట్టు యజమాన్యం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ అభిమానులు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే నిన్న రోహిత్ శర్మ వైఫ్ రితికా సింగ్ ఈ విషయంపై ఘాటుగా స్పందించింది.

ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ ఖాతాను హార్దిక్ అన్ ఫాలో చేసినట్లు సమాచారం. కానీ నెటిజన్లు దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ అసలు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావడం లేదని వాదిస్తున్నారు. మరికొంతమంది వీరిద్దరూ కొన్నేళ్లుగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news