శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. ప్రమాదం, 9మంది ఉద్యోగుల మృతిపై స్థానిక ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు శుక్రవారం రాత్రి సీఐడీకి బదిలీ అయింది.
సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ శనివారం ప్రమాద ఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఆయనతోపాటు ఫోరెన్సిక్ నిపుణులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దుర్ఘటనకు దారి తీసిన కారణాలను విశ్లేషించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.