స్నేహితురాలి ఇంట్లో సీఐడీ డీఎస్పీ ఆత్మహత్య…అదే కారణమా ?

-

బెంగళూరులో ఒక సీనియర్ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. బెంగళూరు సీఐడీ డీఎస్పీ లక్ష్మి (33) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో తన స్నేహితురాలి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ల‌క్ష్మి ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగ‌ళూరు లోని అన్న‌పూర్నేశ్వ‌రి న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో డీఎస్పీగా ప‌ని చేస్తున్నారు. త‌న స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లిన ల‌క్ష్మి ,అక్క‌డ గ‌దిలోకి వెళ్లి ఎంత‌కూ  బ‌య‌ట‌కు రాలేదు.

hanging-suicide

దీంతో త‌లుపులు బ‌ద్ద‌లుకొట్టి వెళ్ళగా ఆమె ఉరి వేసుకుని ఉన్న‌ట్లు గుర్తించారు. ఆమెను వెంట‌నే కిందికి దించి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించిన‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. 2014 బ్యాచ్ కు చెందిన లక్ష్మి 2017 లో విధులలో నియ‌మితులయ్యారు. ఎనిమిది సంవ‌త్స‌రాల కితమే ఈమెకు పెళ్లి అయినా సంతానం క‌ల‌గ‌లేదు. సంతానం క‌లుగ‌లేద‌న్న నిరాశ‌తో ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఆమె ఆత్మ‌హ‌త్య‌కు ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయా ? అనే కోణంలో కూడా ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version