టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో టీఎన్ఆర్ మృతి

-

హైదరాబాద్: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో ఇటీవల పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూట్ ఛానల్ యాంకర్, సినీ నటుడు తుమ్మల నరసింహారెడ్డి (టీఎన్ఆర్) కరోనాతో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల ముందు టీఎన్ఆర్‌కు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన కన్నుమూశారు. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

కాగా తుమ్మల నరసింహారెడ్డి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. నేనే రాజు నేనే మంత్రి, జార్జిరెడ్డి, సుబ్రహ్మణ్యపురం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల్లో కీలక పాత్రలో కనిపించారు.

ఇక టీఎన్ఆర్ మృతిపై హీరో నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీఎన్ఆర్ చనిపోయారని తెలిసి షాక్‌కు గురయ్యానన్నారు. టీఎన్‌ఆర్ యూట్యూబ్ ఇంటర్వ్యూలు చాలా ఆలోచన కలిగించేవిగా ఉంటాయని పేర్కొన్నారు. టీఎన్ఆర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version