ఈ రాష్ట్రాల్లో సినిమా హాల్స్ ఓపెన్, ఈ రాష్ట్రాల్లో క్లోజ్…!

-

కేంద్రం ‘అన్‌లాక్ 5.0’ మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుండి అనేక రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తిరిగి తెరవడానికి అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుండి దేశంలో సినిమా థియేటర్లు మూసివేసారు. ఏడు నెలల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మొదలు పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటకలలో ఈ రోజు నుండి సినిమా హాళ్ళు తిరిగి ఓపెన్ చేస్తారు.

తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గడ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇవి ఇంకా మూసివేసి ఉంటాయి. పంజాబ్ ప్రభుత్వం కూడా ఇప్పట్లో సినిమా హాల్స్ వద్దు అని చెప్పింది. భారతదేశపు అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిటర్ అయిన పివిఆర్ సినిమాస్ ఈ రోజు నుండి 500 స్క్రీన్స్ ని ఓపెన్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version