ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినిమా టికెట్ల ధర వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేవిధంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సినిమా టికెట్ల కమిటీ భేటీ కానున్నది. ఇప్పటికే డ్రాప్ట్ రికమెండేషన్లు సిద్ధమయ్యాయి. ఇవాళ జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. భౌగోళిక క్యాటగిరిలో జీవో 35 ప్రకారం.. నాలుగు ప్రాంతాలు కాకుండా మూడు ప్రాంతాలుగా కమిటీ సిఫార్సు చేసింది. గ్రామపంచాయతీ, నగర పంచయాతీ నగర పంచాయతీ ఏరియాగా సిఫారసు చేసినట్టు సమాచారం.
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగరపంచాయతీల వారిగా టిక్కెట్ ధరల ఖరారుకు కమిటీ సిఫారసు చేయనుంది. టికెట్ల క్లాస్‌లోను సవరణకు సూచనలు చేసే అవకాశం ఉది. ఇప్పుడున్న మూడు క్లాసులకు బదులు ఇకపై రెండు క్లాసులు మాత్రమే ఉంచేవిధంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. దీంతో డీలెక్స్ కేటగిరి ఎగిరిపోయే అవకాశముంది. అన్ని థియేటర్లలో ఎకానమీ, ప్రీమియం రెండే క్లాసులకు కమిటీ సిఫారసు చేయనుంది. 40 శాతం సీట్లు ఎకానమి కేటగిరి, 60 శాతం ప్రీమియం కేటగిరి కింద కేటాయించాలని కమిటీ సూచనలు చేసే విధంగా నిర్ణయం తీసుకోనుంది.