Valentine’s day శ్రీరెడ్డి కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దీక్ష.. ఫోటో షేర్ చేసిన శ్రీరెడ్డి

-

శ్రీరెడ్డి పేరు సోష‌ల్ మీడియాలో నిత్యం ఏదో విధంగా వైర‌ల్ అవుతూనే ఉంటుంది. ఆమె గురించి ప్ర‌త్యేకంగా చెప్పన‌క్క‌ర్లేదు. కాస్టింగ్ కౌచ్‌, రాజ‌కీయాలు, టాపిక్ ఏదైనా స‌రే త‌న మార్కు విమ‌ర్శ‌లు చేస్తుంది. ఇక వైసీపీ పార్టీ, జ‌గ‌న‌న్న అంటే అంతులేని అభిమానం చాటుతూ, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను చీల్చి చెండాడుతుంది.

అయితే తాజాగా… ఇక ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై నటి శ్రీరెడ్డి సంచలన పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఇంత‌కీ అందులో ఏముందంటారా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కోసం దీక్ష చేస్తున్నాడంటూ ఓ మీమ్  పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున ఈ పోస్టు పెట్టగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ‌తంలో చాలాసార్లు శ్రీరెడ్డి జీవ‌న్ రెడ్డి పై విమ‌ర్శ‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

అలాగే ఈ పోస్ట్ ఎవరినీ కించపరిచే ఎందుకు పెట్టలేదు అంటూ కూడా రాసుకొచ్చింది శ్రీ రెడ్డి. ఇక ఈ పోస్టు వివరాల్లోకి వెళితే… ఓ పార్క్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూర్చోగా… ఆయన ముందు శ్రీరెడ్డి కూర్చుని ఉంది. ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్లు… ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది శ్రీరెడ్డి కి అనుకూలంగా పెడితే… మరికొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె పై సీరియస్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version