వార‌ణాసిలో కేసీఆర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. హోర్డింగ్‌లు

-

భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సొంత నియోజ‌క‌వ‌ర్గమైన వారణాసిలో ప్రధాన కూడళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్ లు వెలిశాయి. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ లోనే విద్యాభ్యాసం చేశాడు.

ప్రస్తుతం వారణాసి లో స్థిరపడ్డ తర్వాత కూడా తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఉన్న అపారమైన అభిమానం తో వారణాసి లోని చౌక ఘాట్, ఫాతమాన్ రోడ్డు, రథయాత్ర మరియు ప్రధాన కూడళ్ళలో హోర్డింగ్ ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ప్రధానమంత్రి సొంత నియోజకవర్గం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హోర్డింగులు ప్రధాన ఆకర్షణ గా దేశ‌వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version