సాధారణంగా మన రక్తంలో ప్లాస్మా ఉంటుంది. ఈ ప్లాస్మా తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రక్తం లోని యాంటీ బాడీస్ ప్లాస్మా లోనే ఉంటాయి ఇవి రోగంతో పోరాడే శక్తిని పొంచి ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ప్లాస్మా థెరపీ చేస్తారు. ఇక ఈ ప్లాస్మా తో కరోనా ను కూడా కట్టడి చేయవచ్చు అనే వదంతు లేకపోలేదు. ప్లాస్మాతో కరోనాను కట్టడి చేయొచ్చో లేదో తెలియదు కానీ ప్లాస్మా థెరపీ తో కరోనా నుండి కోలుకున్నవారిని తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. ఇక ఈ విషయాన్ని గమనించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశం లోనే మొదటి ప్లాస్మా సెంటర్ ను ఢిల్లీ లో ఏర్పాటు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీ లో ప్లాస్మా సెంటర్ తెరుచుకొని కార్యకలాపాలు ప్రారంభించనుంది. వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో రోగం తో పోరాడే కణాలు యాంటీ బాడీస్ ఉంటాయి అటువంటి వారిని ప్లాస్మా దానం చేయాలని సీఎం కేజృవాల్ కోరుతున్నారు.
దేశంలోని తొలి ప్లాస్మా బ్యాంక్ ఇదే..! ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బేష్..!
-