మా ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం.. ముఖ్యమంత్రి, మంత్రి వర్గంపై నమ్మకంతో వ్యాపారులు ముందుకు వచ్చారు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. స్థిరమైన ప్రభుత్వం, దూరద్రుష్టి కలిగిన ప్రభుత్వం కావాలని వ్యాపార సంస్థలు కోరుకుంటాయి. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం పై 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఒక మెరుగైన వాణిజ్యం, వ్యాపారం స్టేట్ గా ఎదగాలని ముఖ్యమంత్రి ఆలోచన. గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు అంటే 1లక్షా 79 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నాము.
పాలసీ విధానాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు తీసుకు వచ్చాము. తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని సద్విమర్శలుగా తీసుకున్నాం. పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం పెట్టుకున్నాం. సింగపూర్ కు చెందిన ఇద్దరు మంత్రులను కలిశాము. మూసీ ప్రక్షాళన, నిరుద్యోగుల నైపుణ్యం పెంచే అంశాల పై ముఖ్యమంత్రి సింగపూర్ మంత్రులతో చర్చించాను. సింగపూర్ మంత్రులు కూడా తమ సహకారం అందిస్తామన్నారు. సింగపూర్ రివర్ చిన్నదే కానీ.. నదిని ప్రక్షాళన చేస్తే అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారని తెలిసింది. ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ అందించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.