రాజధాని నిర్మాణానికి రూ.25 లక్షల విరాళం… బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన సీఎం చంద్రబాబు

-

మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి విరాళాలు ఇవ్వడానికి రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారు.తాజాగా ఏలూరులోని ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి ఓ వైద్య విద్యార్థిని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు శనివారం విరాళం ఇచ్చారు. అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుని కలిసి విరాళం అందించారు.

అమరావతి నిర్మాణానికి రూ.25 లక్షలు, పోలవరం ప్రాజెక్టుకు రూ.1 లక్ష చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు. తమకున్న మూడు ఎకరాల భూమిలో ఎకరం పొలం అమ్మగా రూ.25 లక్షలు వచ్చాయని వాటిని రాజధానికి, తన బంగారు గాజులు అమ్మగా వచ్చిన రూ.లక్షను పోలవరానికి విరాళంగా అందించినట్లు వైష్ణవి చెప్పారు. ‘రాజధానిని నిర్మిద్దాం – రాష్ట్రాన్ని అభివృద్ది చేద్దాం’ అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తనవంతు సాయం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. లాభాపేక్ష లేకుండా విరాళం ఇచ్చి,స్ఫూర్తి నింపిన వైష్ణవిని రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news