ప్రస్తుతం అతడే ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ : సూర్య కుమార్ యాదవ్

-

ఓవైపు ప్రపంచమంతా టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తుంటే భారత బ్యాట్స్ మెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం అత్యుత్తమ బౌలర్‌గా మరొకరి పేరును చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 పోరులో అఫ్గాన్‌ తో జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఇండియాని గెలిపించడంలో కీలకపాత్ర వహించారు. అర్ధ సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న స్టార్‌ బౌలర్ రషీద్‌ ఖాన్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తే చాలని.. ప్రస్తుతం అతడే ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ అని సూర్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

”గతంలోనూ నేను ఇదే మాట చెప్పా. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను అర్థం చేసుకుని ఆడటం చాలా కష్టం అని అన్నారు. అతడు బౌలింగ్‌కు వచ్చాడంటే ఎలాంటి షాట్లు కొట్టాలనేది ముందే అనుకుంటా. కానీ, ఒక్కోసారి అది విఫలమయ్యే ప్రమాదం ఉంది అని తెలిపారు. అతడిపై ఆధిపత్యం ప్రదర్శించడం సులువేం కాదు. ఈసారి మాత్రం కాస్త దూకుడుగానే ఆడగలిగా” అని సూర్య అన్నారు రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో ఆరు బంతులను ఎదుర్కొన్న సూర్య.. 16 పరుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news