‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా సీఎం చంద్రబాబు..!

-

నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ షో ను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు. ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.సీజన్ 4కి రంగం సిద్ధమైంది. ఈ షోకు గెస్ట్ లుగా ఎవ్వరూ రాబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరం మారింది. 

‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా సీఎం చంద్రబాబు రానున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు హాజరయ్యారు. సీజన్ 2 లో ప్రతిపక్ష నాయకుడిగా హాజరైన చంద్రబాబు ఇప్పుడు సీజన్ 4లో సీఎం హోదాలో హాజరుకానున్నారు. దీంతో ఈ ఎపీసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక సీఎం ఇలాంటి షోలలో పాల్గొనడం ఇదే మొదటి సారి. ఈ షో లో సీఎం చంద్రబాబు నాయుడి ని ఎమ్మెల్యే  బాలయ్య ఎలాంటి ప్రశ్నలతో తికమక పెడతారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news