ముస్లింలకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

-

బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహార వితరణ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘త్యాగగుణాన్ని ప్రబోదించే బక్రీద్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి అని ప్రజల్లో స్వార్థం, రాగద్వేషాలు ఉండకూడదు. మానవుల్లో త్యాగనిరతిని పెంచడమే బక్రీద్ ఉద్దేశం. సమైక్యత, సమానత్వం గురించి ప్రతిఒక్కరూ ఆలోచించాలి.’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

రంజాన్ తర్వాత ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగ బక్రీద్. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి.. ఈద్ అంటే పండుగ అని అర్థం.ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news