టీడీఎల్పీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాయకత్వ లక్షణాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మంచి చేసి కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళ బాబాయ్ ని హత్య చేసి నారా సుర రక్త చరిత్ర పేరుతో నాకు అంటించే ప్రయత్నం చేశారు అని అన్నారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని చాలామంది చూశారు. నాపై ఆనాడు తప్పుడు ప్రచారం చేశారు అని తెలిపారు.
ఇక 2013 ఆత్మగౌర యాత్ర సంఘటన విషయాలు నేతతో పంచుకున్న సీఎం చంద్రబాబు.. 2013లో నేను ఆంధ్ర పర్యటనకు వస్తానంటే మన పార్టీ నాయకులే వద్దన్నారు. కానీ ఆనాడు నా నిర్ణయాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అమలు చేశారు. ఆత్మ గౌరవ యాత్ర ద్వారా 2014లో అధికారంలోకి వచ్చాం. అప్పుడు ప్రత్యర్థుల కుట్రలను కూడా యరపతినేని సమర్థవంతంగా తిప్పి కొట్టారు. ఆనాడు ఆత్మగౌరవ యాత్ర పొందుగల నుంచి ప్రారంభించినప్పుడు యరపతినేని శ్రీనివాసరావు పూర్తి సహకారం అందించాడు అని వివరించారు చంద్రబాబు.