ఏపీ బడ్జెట్ ను పూర్తిగా పరిశీలించి కామెంట్ చేస్తాం : పురందేశ్వరి

-

బీజేపీ కండువా కప్పుకున్నారు అమ్మ హాస్పిటల్ డాక్టర్లు దుర్గా శ్రీలక్ష్మి, పవన్ కుమార్. వీరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. మచ్చలేని పార్టీ కావడంతో బీజేపీలో చేరాం అని ఈ డాక్టర్ దంపతులు పేర్కొన్నారు. బీజేపీ వాణి ఎప్పుడూ ప్రజా వాణి. సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం బీజేపీ విధానం అని పురంధేశ్వరి అన్నారు.

అయితే రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం. వేలెత్తి చూపలేని పార్టీగా మోదీ పాలనలో బీజేపీ ఉంది. గతంలో స్కాముల ప్రభుత్వాలు చూసాం.. మోదీ నేతృత్వంలో స్కీముల ప్రభుత్వాం చూస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 52% ఓట్లు బిజెపికి వస్తాయని ఒక సర్వేలో తేలింది. అందుకే బీజేపీలో చేరికలు కొనసాగుతాయి. ఇక పశ్చిమ విజయవాడలో తగ్గిన 50వేల ఓట్లు కూడా బీజేపీకి వస్తాయి అని పురందేశ్వరి స్పష్టం చేసారు. అలాగే ఏపీ బడ్జెట్ ను పూర్తిగా పరిశీలించి కామెంట్ చేస్తాం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news