ఎన్టీఆర్-దగ్గుపాటి ప్రసాద్ వివాదం ముదురుతోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు ఎన్టీఆర్ అభిమానుల రాష్ట్ర స్థాయి సమావేశం జరుగనుంది.

ఆడియోపై విచారణ చేయాలని కోరారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం చేశారు. పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని కేంద్ర టీడీపీ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు.
కాగా ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఎన్టీఆర్ అభిమానులను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో క్షమాపణ చెప్పాలంటూ ఎన్టీఆర్ అభిమానులు చేయాలనుకున్న ధర్నా నిలిపివేయాలంటూ మదనపల్లి ఎన్టీఆర్ అభిమాని టెంపర్ రాజేష్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఏపీలో మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు.