తాడిపత్రి రాజకీయాలతో ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కుతున్నాయి. నేడు తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. ఏడాది కాలంగా తాడిపత్రికి దూరంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉంటున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట 5 వాహనాలు, 40 మందికి అనుమతి ఇచ్చింది హై కోర్టు.

ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం జరగనుంది. దింతో తాడిపత్రి హై టెన్షన్ నెలకొంది. కాగా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను ఈ రోజు తాడిపత్రి కి వెళుతున్నాను అని పేర్కొన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి కి ఎవ్వరూ రావద్దని నేను మా కార్యకర్తలు చెప్పానని వెల్లడించారు పెద్దారెడ్డి.