విజయనగరం జిల్లాలో ప్రమాద కరమైన వాతావరణం నెలకొంది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో ఉన్న వరద నీటిని వదలడంతో ఇళ్లల్లోకి, పొలాల్లోకి చేరింది నీరు. ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితి ఉందని.. అధికారులు తక్షణమే స్పందించి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తోంది.

అటు ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో ఉన్న వరద నీటిని వదలడంతో ఇళ్లల్లోకి, పొలాల్లోకి చేరిన నీరు
ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితి ఉందని.. అధికారులు తక్షణమే స్పందించి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ pic.twitter.com/GTKeSs68FS
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2025