ఏపీఎస్ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సులు, రవాణా శాఖలో పలు అంశాలపై రేపు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు దిశగా అధికారుల కసరత్తు పూర్తయింది. తెలంగాణ, కర్ణాటక లలో ఫ్రీ బస్సుల అమలును అధ్యయనం చేసి.. అనంతరం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు విధి విధానాలు నిర్ణయించే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ లో నిత్యం ప్రయాణించే ప్రయాణికులలో 15 లక్షల వరకూ మహిళలు ఉన్నారు. దాంతో ఉచిత బస్సు ప్రయణానికి నెలకు 250 కోట్ల ఖర్చు వస్తుంది అని అంచనా వేస్తున్నారు.
అయితే మహిళలకు ఉచిత బస్సు అమలుకు ప్రభుత్వం నెలకు 25% వరకూ కార్పొరేషన్ కు వదిలేయాలి. మరో 125 కోట్ల వరకూ నెలకు ఆర్టీసీ కే ప్రభుత్వం రీఇంబర్సుమెంటు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మహిళల ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం సమీక్షలో మహిళలకు ఉచిత బస్సుపై అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.