తిరుపతి జిల్లా శ్రీ సిటీలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. మరో సంస్థలకు ఆయన శంకు స్థాపన చేసారు. ఇక్కడ మొత్తం 15 పరిశ్రమలకు సంబంధించిన కార్యకలాపాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్ లలో పలు కంపెనీల సీఈవోలతో జరిగే సమావేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపై సీఎం మాట్లాడారు. వీటిలో దాదాపు 2740 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు చంద్రబాబు. రూ.900 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. 2047 వరకు ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా నిలుస్తుంది. ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరూ భారతీయులు ఉంటారని తెలిపారు చంద్రబాబు. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని తెలిపారు. శ్రీ సిటీలోని 8 వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టాం. ప్రభుత్వానికి పరిశ్రమల ద్వారానే అధిక ఆదాయం సమకూరుతుందని తెలిపారు.