నేడు తిరుపతి లో మృతుల కుటుంబాలను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

-

తిరుపతి తొక్కిసలాట ఘటనలో  మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.  పలువురు భక్తులకు తీవ్రగాయాలు కావడంతో రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08772236007 నెంబర్ కు సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకొని మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించనున్నారు. 

తిరుపతిలోని వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులకు పద్మావతి పార్కులో ఉంచారు. అప్పుడే ఓ మహిళా అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది గేటు తెరిచారు. టోకెన్లు ఇచ్చేందుకు గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అదేవిధంగా క్యూ లైన్ల వద్ద సిబ్బంది ఓవరాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణం అని మరికొందరూ భక్తులు మండిపడ్డారు. మరణించిన వారిలో తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన వారు ఒకరు కాగా.. మిగిలిన వారందరూ ఏపీకి చెందిన వారు.

 

Read more RELATED
Recommended to you

Latest news