ఏపీ సీఎం చంద్రబాబు డీఎస్సీ పై కీలక ప్రకటన చేశారు. తాజాగా గవర్నర్ తీర్మాణం పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. వైసీపికి 11 మంది సభ్యులే ఉన్నారు. ప్రతిపక్ష హోదా మనం ఇచ్చేది కాదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తాం. ముఖ్యంగా త్వరలోనే డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే 204 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని.. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. మే లో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని తెలిపారు.
సేవా దృక్పథంతో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు. ఏపీకి ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేకపోయిందన్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. అభివృద్ధి చేస్తేనే సంపద.. తద్వారానే ఆదాయం అన్నారు. ఉపాధి కల్పన మా ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. అందరూ గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతామని తెలిపారు. వర్క్ ప్రమ్ హోమ్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.