సీఎం జగన్ ఉద్యోగులను మోసం చేశారు: దేవినేని ఉమా

-

2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి వారంలోనే సిపిఎస్ రద్దు చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే పవర్ లోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న ఇంతవరకు సిపిఎస్ రద్దు ఊసేలేదు. దీంతో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు చాలాసార్లు గళమెత్తారు. అయితే తాజాగా సిపిఎస్ రద్దు కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళం పాడడం పై టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..” నాడు వారంలో సిపిఎస్ రద్దు అని అధికారంలోకి రాగానే ఉద్యోగులను మోసం చేశారు. మూడేళ్ల అసమర్థ పాలనతో ఉద్యోగుల హామీలను గాలికొదిలేసి ఒక పోస్టు భర్తీ చేయలేదు. జీతాలు, పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వలేని స్థితికి తెచ్చారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి నేడు మాట తప్పని మడమ తిప్పడం నిజం కాదా?.. వైయస్ జగన్” అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version