బ్రేకింగ్: జగన్ అత్యవసర సమావేశం

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వాక్సిన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో ఏపీలో వ్యాక్సిన్… ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వం దీనికి సంబంధించి అత్యవసర సమావేశం నిర్వహిస్తుంది. మొదటి డోసు వేసిన వేసిన వారికి రెండో డోసు ఎదురు చూపులు చూస్తున్న నేపధ్యంలో వ్యాక్సిన్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇకపై వాక్సిన్ పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. వాక్సిన్ ప్రక్రియపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వాక్సినేషన్ ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అధికారులతో భేటీ తరువాత వ్యాక్సిన్ ప్రక్రియపై స్పష్టత ఇస్తారు. డిప్యూటీ సీఎం (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), ఛీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చైర్‌పర్సన్‌ డా. కే.ఎస్‌. జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం. టీ. కృష్ణబాబు సహా ఇతర అధికారులు హాజరు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version