ఏపీ సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది. ఏపీలోనూ సినిమా షూటింగులకు అనుమతి లభించినట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఈ నెల జూన్ 15వ తేదీ నుంచి సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రి పేర్ని నానితో సమన్వయం చేసుకోవాలని సూచించారని తెలిపారు. సీఎం జగన్‌ను కలవాలని గత ఏడాది కాలంగా అనుకుంటున్నామని, అది ఈరోజుకు కుదిరిందని ఆనందం వ్యక్తం చేసారు చిరు.