సీఎం జగన్ విద్వేష .. వికేంద్రీకరణ కు బ్రాండ్ అంబాసిడర్ : నారా లోకేష్

-

టీడీపీ అధినేత చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు కేరాఫ్ అడ్రస్ అయితే, సీఎం జగన్ విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగం వృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు అన్ని జిల్లాలకు ఎలా అందాయో వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే పూసగుచ్చినట్టు బయటపెట్టిందన్నారు.

lokesh

ఐదేళ్ల పాలనలో 39 వేల 450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5 లక్షల 13 వేల 351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30 వేల 428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2 లక్షల 78 వేల 586 ఉద్యోగాలు రాబోతున్నాయని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెబుతోందని గుర్తు చేశారు.”14 నెలల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి గుడ్ బై చెప్పిన కంపెనీలే తప్ప.. వచ్చిన ఒక్క కంపెనీ అయినా ఉందా?” అని లోకేశ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంపై లోకేశ్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version